ఓం శాంతి
ప్రజాపిత బ్రహ్మా జీవిత చరిత్ర సంక్షిప్తంగా
1976వ సంవత్సరంలో లేఖరాజ్ కృపలానీ నామధేయంతో ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన బ్రహ్మాబాబా ఒక స్కూలు టీచర్ తనయుడు. లేఖరాజ్ కు హిందూ ధార్మిక విషయాలలో చాలా ఎక్కువ మక్కువ. చిన్న వయసులోనే అనేక వృత్తులు నిర్వహించి, చివరికి ఈ బంగారు నగల వ్యాపారం లో ప్రవేశించారు. తరువాత ఒక సత్యమైన వజ్రాల వ్యాపారి గా మారి, తన పరిశీలనా శక్తి తో చాలా సంపదను ఆర్జించారు. వారికి 5 గురు సంతానం. వారు స్థానిక వర్గంలో ఒక నేత గా గౌరవనీయులు గా ఎదిగారు. విశేషించి వారి పరోపకార వృత్తి అందరినీ ఆకర్షించింది. వారి వయస్సు 60 సంవత్సరాలు అనగా 1936లో వారికి సేవా నివృత్తికి బదులుగా వారి జీవితంలో అద్భుత, ఆకర్షణమయ దశలో ప్రవేశించారు. పరమపిత శివపరమాత్మ యొక్క అనేక లోతైన ఆధ్యాత్మిక అనుభవాలు మరియు దర్శనము జరిగిన వారు తన వ్యాపార వ్యవహారాదులు ఆపి, శివ పరమాత్మ ఆజ్ఞానుసారము ప్రజాపిత బ్రహ్మాకుమారీ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయము స్థాపనకు నాంది వేశారు.
పరమాత్మ శివ పరమాత్మ ప్రజాపిత బ్రహ్మా శరీరంలో పరకాయ ప్రవేశం చేసి చెప్పిన దివ్య జ్ఞానమే ఈ సంస్థకు మూలాధారం. దానికై వారు తన పూర్తి సమయము, శక్తి, ధనము అంతా సమర్పితం చేయాలనే భావానుభూతినిపొంది 1937-38 సంవత్సరాలలో 8 మంది కన్యలు – మాతలతో ఒక కార్యనిర్వాహక కమిటీ (ట్రస్టుని) ఏర్పాటు చేసి ఆ ట్రస్టుకు తమ సంపదను పూర్తిగా సమర్పణ చేశారు.
భారత ప్రభుత్వం 1994వ సంవత్సరంలో ప్రజాపిత బ్రహ్మా గౌరవార్థం పోస్టల్ స్టాంప్ ముద్రించడం జరిగింది.
పిదప పరమాత్మ జ్ఞాన మురళి ద్వారా అనేక మంది జిజ్ఞాసులను అలరిస్తూ, జ్ఞాన మార్గంలో నడిపిస్తూ, దివ్యగుణాల ధారణతో శిక్షణలు ఇస్తూ వచ్చారు. ఈ సంస్థ దినదినాభివృద్ధి పొంది ఒక అంతర్జాతీయ సంస్థ గా 10 లక్షల పైగా విద్యార్థులతో 8800 సెంటర్లు పైగా 142 దేశాలలో విస్తరించినది. ఇది ఒక నిజమైన ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం. జాతి, మత, కుల వర్గ వివక్షలు లేని పిల్లలు, పెద్దలు, వృద్ధులు అన్నీ వర్గాల వారు కలిసి అభ్యసించే ఈ విశ్వవిద్యాలయం, పరమాత్ముని నిత్య శిక్షణతో అలరారుచున్నది.